ఒంటరితనం హానికరం
వాషింగ్టన్: ఒంటరితనం మానవీయం కాదు. ఒకానొక విశిష్ట లక్షణాలతో కూడిన నిర్దిష్ట సామాజిక సమూహపు స్వభావ వ్యక్తీకరణ ఒక వ్యక్తి వ్యక్తితత్వమవుతుంది. అంచేత సమూహం బయట విడిగా, ఒంటరిగా బతికే మనిషి నీటి నుండి బయటపడిన చేపలాంటివాడు. ఒంటరితనం ఒక వ్యక్తిని సామాజిక వ్యవహారాల నుండి పరాయీకరణకు గురిచేస్తుంది. అయితే ధూమపానం వల్ల కలిగే శారీరక అనర్ధాలు కంటే కూడా ఒంటరితనం మరింత ఆనారోగ్యకరమని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఒంటరితనానికి, మెదడు కార్యకలాపాలకు మధ్య గల సంబంధాల్ని ఎఫ్ ఎమ్ ఆర్ ఐ స్కానింగ్ ద్వారా పరిశోధకులు కనుగొన్నారు.
వెంట్రల్ స్ట్రియాటమ్ అనే భాగం మనుషుల్లో కలిగే ఆనందానుభూతులకు ఉద్దీపనకు గురవుతుంది. మన అనుభూతుల స్వభావాన్ని విశ్లేషించే మెదడు భాగం ఇదే. మన అనుభూతుల ప్రాప్త స్తానమిదే (రివార్డ్స్ సెంటర్). అత్యంత ప్రశాంతతో కూడిన చిత్రాలను వీక్షిస్తున్న సమయంలో ఒంటరితనంతో బాధ పడేవారిలో కంటే కులాసాగా ఉండేవారిలో వెంట్రల్ స్ట్రియాటమ్ మెదడు భాగం అత్యధిక వేగంగా స్పందిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడంలో వెంట్రయల్ స్ట్రియాటమ్ మెదడు భాగం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం లాంటి ప్రాథమిక ప్రాప్తాలకు(రివార్డ్స్), డబ్బు లాంటి ద్వితీయ ప్రాప్తాలకు ఈ మెదడు భాగం స్పందిస్తుంది. సామాజిక ప్రాప్తాలకు, ప్రేమానుభూతులకు కూడా ఈ ప్రాంతమే కేంద్ర బిందువు.
Pages: 1 -2- News Posted: 16 February, 2009
|