ఒంటరితనం హానికరం
సమాజంలో ఇతరత్రా వ్యక్తుల దృక్కోణాన్ని చూసి పలువురు పలు రకాలుగా స్పందిస్తారు. ఇతరుల దృక్కోణాన్ని గుర్తించి స్పందించే మెదడు కేంద్రంగా మెదడులోని టెంపొరో పేరియటల్ జంక్షన్ పనిచేస్తుంది. ఒంటరితనంతో బాధపడేవారిలో ఈ కేంద్రం స్పందికుండా ఉంటుంది. అదే సమయంలో కల్లోల భరితంగా ఉన్న చిత్రాల పట్ల ఒంటరితనంతో ఉండేవారు అధికంగా స్పందించడాన్ని ఆ పరిశోధకుల బృందం గుర్తించింది. ఇలాంటి చిత్రాలను చూసినపుడు వారు మత మానసిక స్థితితో సరిపోల్చుకుని తాదాత్య్మత నొందుతారని పరిశోధకడు జాన్ కేసియోప్పో తెలిపారు. ఆయన చికాగో విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
మనుషుల్లోని ఒంటరితనపు ఛాయలను, స్థాయిలను గుర్తించేందుకు ఈ అధ్యయన బృందం 23 మంది ఆడవాళ్లను ఎంపిక చేసింది. ఇందుకోసం వారికి ఎఫ్ ఎమ్ఆర్ఐ పరీక్షలను నిర్వహించారు. ప్రశాంతంగా ఉండే చిత్రాలను, గందరగోళపరచే చిత్రాలను వీరికి చూపించి వారి మనోభావాలను ఎఫ్ఎమ్ఆర్ఐ స్కానింగ్ ద్వారా అధ్యయనం చేశారు. ఒంటరితనం మెదడు కార్యకలాపాన్ని, ప్రత్యేకించి వెంట్రల్ స్ట్రియాటమ్ కార్యకలాపాన్ని ప్రభావితం చేస్తే, వెంటల్ స్ట్రియాటమ్ కార్యకలాపం ఒంటరితనాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆ శాస్త్రవేత్తల బృందం తెలియజేసింది. మెదడుకు సంబంధించిన ప్రాప్తపు కార్యకలాపం మందగించడంతో ఒంటరితనం భావావేశం వస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 16 February, 2009
|