హాట్ కేకుల్లా బూతు క్లిప్స్!
ముంబై : వెబ్ బ్రాండ్లకు సంబంధించినంత వరకు 'భారతీయ పోర్న్ (అశ్లీల దృశ్యాలు)'పై మోజు పెరిగిపోయిందనవచ్చు. ఢిల్లీకి చెందిన ఇద్దరు టీనేజర్లకు సంబంధించిన ఎంఎంఎస్ సెక్స్ క్లిప్ ఇంటర్నెట్ లో చోటు చేసుకున్న తరువాత దాదాపు నాలుగేళ్ళకు దేశంలో ఇటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ప్రొఫెషనల్ పోర్నోగ్రఫీతో బోర్ కొట్టి, వాస్తవ జీవితంలో అశ్లీల దృశ్యాలను రహస్యంగా చూసి తృప్తి పడుతుండేవారు ఇప్పుడు తమ భాగస్వాములతో సెక్స్ చేస్తున్నప్పుడు రహస్యంగా చిత్రీకరించిన క్లిప్స్ , హోటల్ బాత్ రూమ్ లో షవర్ స్నానం చేసేటుపుడు, దుస్తుల దుకాణంలోని ట్రైల్ రూమ్ లలో దుస్తులు మార్చుకుంటుండే మహిళలపై రహస్యంగా తీసిన వీడియోల కోసం ఇంటర్నెట్ సైట్ లను సందర్శిస్తున్నారు., వాటి కోసం బిట్ టారెంట్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.
ముంబై కాండివిలి ప్రాంతానికి చెందిన ఒక 19 ఏళ్ళ యువతి డ్రింక్ లో మత్తు మందు కలిపి, తమ సెల్ ఫోన్లతో ఆమె సెక్స్ వీడియో తీసిన స్నేహితుల కేసును దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు ఇంటర్నెట్ లో హాట్ హాట్ గా రిలీజవుతున్న వేలాది క్లిప్ లను చూసి అవాక్కయ్యారు. బిట్ టోరెంట్ వంటి ఫైల్ షేరింగ్ సైట్లు, అశ్లీలాన్ని రహస్యంగా చూసి తృప్తి పడేందుకు దోహదం చేసే బ్లాగ్ లలోను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ వీడియోలలో చాలా వరకు అందుబాటులో ఉంటున్నాయి.
'అమాయక యువతుల వీడియోలు, ఎంఎంఎస్ క్లిప్ లను ప్రదర్శించేంత వరకు భారతీయ పోర్న్ గురించిన ప్రత్యేకత ఏమీ లేదు' అని ఢిల్లీకి చెందిన ఇంటర్నెట్ భద్రతా నిపుణుడు రాహుల్ గుప్తా పేర్కొన్నారు. 'మామూలు అడల్ట్ దృశ్యాల కన్నా ఇటువంటి రహస్య వీడియోలనే చాలా మంది భారతీయ పురుషులు ఇష్టపడుతుంటారు. కనుక ఇటువంటి అశ్లీల దృశ్యాలే వెబ్ సైట్లకు బలం చేకూరుస్తున్నాయి' అని రాహులు గుప్తా అన్నారు.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|