హాట్ కేకుల్లా బూతు క్లిప్స్!
కాండివిలి యువతి కేసులో ఆమె ఎంఎంఎస్ ను ఆన్ లైన్ లో పొందుపరచలేదు. కాని కాలేజీ సహచరులకు పంపిణీ చేశారు. 'ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె పోలీసుల వద్దకు వచ్చింది. కాని ఆమె వలె కాకుండా చాలా మంది బాధితులు తమ ప్రైవసీకి గండి పడిన విషయాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు కూడా' అని ఒక పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. హనీమూన్ లో పాల్గొంటున్న ఒక జంటకు సంబంధించిన వీడియో ను ఒక ఫైల్ షేరింగ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకుంటుండడాన్ని ప్రస్తావిస్తూ ఆయన అలా వ్యాఖ్యానించారు.
'రహస్యంగా అశ్లీల దృశ్యాలు చూసి తృప్తి పడే తత్వం ఉన్న వారు ఈ వీడియోలను వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తుంటారు' అని రాహుల్ గుప్తా తెలిపారు. 'సదరు వీడియో గురించి ఏది ఇష్టంగా చూడవచ్చో వివరించే వివరణాత్మక వ్యాఖ్య ప్రతి పోస్ట్ లోనూ ఉంటుంది. ఒకటి నుంచి పది ర్యాంకుల వరకు వీడియోల రేటింగ్ కోసం అభ్యర్థనతో కూడా ఈ పోస్ట్ లు వస్తుంటాయి' అని గుప్తా పేర్కొన్నారు. అశ్లీల దృశ్యాల వీడియో పంపిణీదారుల వలె వాటి వీక్షకులు కూడా దోషులే అని పేర్కొనే మన దేశ ఐటి చట్టం ఇటువంటి రహస్య వీక్షకులను, సైట్ హోస్ట్ లను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నది. అమాయక బాధితులు పోలీసుల వద్ద ఎన్నడూ ఫిర్యాదు చేయకపోవడమే ఇందుకు కారణం.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|