ముంబై: ముందు ఒక శుభవార్త. గడచిన నాలుగు సంవత్సరాలలో కాలేజీ విద్యార్థులలో వేశ్యల వద్దకు వెళ్ళేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు దుర్వార్త. తమ గాళ్ ఫ్రెండ్స్ పూర్వ చరిత్ర ఎటువంటిదైనా వారితో సెక్స్ సౌఖ్యం పొందితే తమకు హెచ్ఐవి\ ఎయిడ్స్ సోకే అవకాశం తక్కువ అని యువకులు భావిస్తుండడమే ఇందుకు కారణం.
మహారాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ విద్యార్థులు స్నేహితురాళ్ళతో కాకుండా వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకుంటేనే హెచ్ఐవి\ఎయిడ్స్ కు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. భారత కుటుంబ నియంత్రణ సంస్థ (ఎఫ్ పిఎఐ) నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ అపోహ వల్ల మహారాష్ట్రలో ఈ వ్యాధి ప్రబలవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తున్నది.