గాళ్ ఫ్రెండ్ తో ఎయిడ్స్ రాదా?
2004 నుంచి నాలుగు సంవత్సరాల పాటు నిర్వహించిన ప్రవర్తన సంబంధిత పర్యవేక్షణ అధ్యయనం (బిఎస్ఎస్)లో యువకులు వేశ్యలతో కన్నా స్నేహితురాళ్ళతో సెక్స్ పట్ల సుముఖత చూపుతున్నారని వెల్లడైంది. దీని వల్ల తమకు చేతి చమురు తక్కువే వదులుతుందని వారి భావన. వేశ్యల వద్దకు వెళ్ళే విద్యార్థుల శాతం 2004లో 23 శాతం నుంచి 2006లో 5 శాతానికి, 2008లో 3 శాతానికి తగ్గిపోయింది. అదే కాలంలో వేశ్యలు కాని భాగస్వాములు లేదా స్నేహితురాళ్ళతో సెక్స్ అనుభవం పొందిన యువకుల శాతం 2004లోని 11 శాతం నుంచి 2008లో 16 శాతానికి పెరిగింది.
'కాలేజీ విద్యార్థులలో సెక్సువల్ ప్రవర్తనలో పెద్ద మార్పు వచ్చింది' అని ముంబై ఎఫ్ పిఎఐలో పర్యవేక్షణ, మదింపు విభాగం మేనేజర్, అధ్యయనం కన్వీనర్ జయంత బాసు పేర్కొన్నారు. ముంబై, ఠాణె, పుణె, సంగ్లి, సతారా, సోలాపూర్, ఔరంగాబాద్, నాగపూర్ నగరాలలోని 100 డిగ్రీ కాలేజీల నుంచి 2276 మంది విద్యార్థులు, 1098 మంది విద్యార్థినులపై ఈ అధ్యయనం నిర్వహించారు.
Pages: -1- 2 News Posted: 18 February, 2009
|