'గిరిజన' తాజ్ మహల్!
గౌహతి: చాన్ తువామా షాజహాన్ ఏమీ కాడు. కాని తన ప్రేమకు చిహ్నాన్ని నిర్మించడంలో ఆ మొఘల్ చక్రవర్తి ఎన్నో ఏళ్ళపాటు పడిన కష్టాన్ని తువామా అనుకరించాడు. మరణించిన తన భార్య స్మృతికి చిహ్నంగా 3800 అడుగుల ఎత్తున అతను ఒక తాజ్ మహల్ ను కట్టించాడు. మిజోరమ్ రాజధాని ఐజాల్ కు పాలు, కూరగాయలు భారీ స్థాయిలో సరఫరా చేసే గ్రామంగా దుర్త్ లాంగ్ కు పేరు ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి కొత్త గుర్తింపు ఇస్తూ 'గిరిజన తాజ్ మహల్' అవతరించింది. మిజో రాజధానికి 15 కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.
మరణించిన తన భార్య రోజలిన్ పుయీ వార్తె జ్ఞాపకార్థం చాన్ తువామా 128 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన 'ప్రేమ చిహ్నం' ముంతాజ్ మహల్ జ్ఞాపకచిహ్నంగా షాజహాన్ కట్టించిన పాలరాతి భవనం అంత అత్యద్భుత కట్టడం కాదు. కాని ఆ చక్రవర్తి మాదిరిగా అతను కూడా తన 'తాజ్ మహల్' కోసం రాజస్థాన్ నుంచి పాలరాయిని, గ్రానైట్ ను ప్రత్యేకంగా తెప్పించాడు.
Pages: 1 -2- News Posted: 18 February, 2009
|