'గిరిజన' తాజ్ మహల్!
ఈ స్మారక భవనం నిర్మాణం గత సెప్టెంబర్ లో పూర్తయింది. ఇందుకు భారీ స్థాయిలో కోటి పది లక్షల రూపాయలు ఖర్చు అయింది. అయితే, 54 సంవత్సరాల చాన్ తువామాకు ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడానికి అదేమంత అధిక మొత్తం కాదు. మిజోరమ్ లో సాటిలేని రీతిలో నిర్మితమైన ఆ సమాధి అందరి దృష్టిని ఆకర్షిస్తోందంటే అందుకు బలమైన కారణమే ఉంది. మిజో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణిస్తారు. వారికి వివాహం చేయాలంటే పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు. సాధారణంగా విందు కోసం ఒక పందికి చెల్లించే ధరకు సమానంగా ఒక వధువు రేటు ఉంటుంది.
దీనికైన ఖర్చులో కొంత భాగాన్ని చాన్ తువామా తన భార్యతో కలసి ప్రపంచ యాత్ర చేయడం కోసం పొదుపు చేశాడు. కచ్చితంగా చెప్పాలంటే ఆ మొత్తం రూ. 31 లక్షలు. ఆమె దుర్త్ లాంగ్ లో తమ కుటుంబ ఆధ్వర్యంలోని కె.వి. మల్టీపర్పస్ స్కూల్ లో బోధిస్తుండేది. '2001 నవంబర్ 27న ఒక కారు ప్రమాదంలో ఆమె మరణించిన తరువాత నాకు డబ్బు వల్ల ఉపయోగం కనిపించలేదు. అందువల్ల ఆమె గుర్తుగా దేనిపైనైనా ఆ డబ్బును వెచ్చించాలని నేను నిశ్చయించుకున్నాను' అని చాన్ తువామా చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 18 February, 2009
|