ఆపిల్ తో కేన్సర్ కు చెక్
వాషింగ్టన్: రోజుకొక ఆపిల్ పండు తింటే డాక్టర్ అవసరముండదని గతంలో కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి. దాంతోపాటు రోజుకొక ఆపిల్ పండు తింటే బ్రెస్ట్ కేన్సర్ దగ్గరకు రాలేదని ఒక తాజా అధ్యయనం తెలియజేసింది. మహిళలను పట్టి పీడిస్తున్న మహమ్మారి బ్రెస్ట్ కేన్సర్ గురించి అందరికి తెలుసు. యుటెరెస్ కేన్సర్ తర్వాత మహిళలకు అత్యం ప్రాణాంతకమైన జబ్బుగా బ్రెస్ట్ కేన్సర్ నిలుస్తుంది. బ్రెస్ట్ కేన్సర్ మహిళల్లో వేగంగా విస్తరిస్తోందని కార్నెల్ విశ్వవిద్యాలయం కార్నెల్ ఫుడ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ రూయ్ హాయ్ లూ తెలిపారు.
తాజా ఆపిల్ పళ్ల రసం తీసుకున్న ఎలుకల్లో మమ్మరీ ట్యూమర్ల సైజు గణనీయంగా తగ్గిందని లూ తన అధ్యయనంలో వెల్లడించారు. ఆపిల్ పళ్ల రసం ఇచ్చే కొద్దీ వాటి ట్యూమర్ల పరిమాణం తగ్గిపోతోందని ఆయన తెలిపారు. ఆపిల్ రసం తీసుకున్న ఎలుకల ట్యూమర్ల సైజు తగ్గడమే కాదు, ఆ ట్యూమర్లు తక్కువ ప్రమాదకరంగా మారినట్లు, వాటి ఎదుగుదల మందగించినట్లు పరిశీలకులు గుర్తించారు. 2007లో ప్రాథమికంగా జరిపిన అధ్యయన ఫలితాల్ని ఈ అధ్యయనం ధృవీకరించిందని లూ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 18 February, 2009
|