ఆపిల్ తో కేన్సర్ కు చెక్
అడెనోకార్సినోమా రకం ప్రాణాంతక ట్యూమర్ బ్రెస్ట్ కేన్సర్ రోగుల్లో 81 శాతం మంది మరణానికి కారణమయ్యింది. మమ్మరి కేన్సర్ తో బాధపడుతున్న జీవులు అత్యధికంగా చనిపోతున్నాయని ఆ అధ్యయనం పేర్కొంది. 24 వారాలపాటు ఎలుకలకు ఆపిల్ పళ్ల రసం అందించిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. తక్కువ మోతాదులో రోజుకు ఒక ఆపిల్ రసం తీసుకున్న ఎలుకల్లో 57 శాతం ట్యూమర్ పెరుగుదలని, మధ్యరకంగా అంటే రోజుకు మూడు ఆపిల్ పళ్ల రసం తీసుకున్న ఎలుకల్లో 50 శాతం, ఎక్కువ మోతాదులో అంటే రోజుకు ఆరు ఆపిల్ పళ్ల రసం తీసుకున్న ఎలుకల్లో 23 శాతం ట్యూమర్ ఎదుగుదలను పరిశోధకులు గుర్తించారు.
యాపిల్ రసం తాగిన జంతువుల్లో యాంటీ ప్రొలిఫరేటివ్ కార్యకలాపాన్ని పరిశోధకులు గుర్తించారని లూ తెలిపారు. యాపిల్ పళ్లతోపాటు, ఇతర పళ్లు, కూరగాయాల్లో ఉన్న ఫెనాలిక్స్, ఫ్లెవనాయిడ్స్ లకు సంబంధించిన కేన్సర్ వ్యతిరేక కార్యకలాపాన్ని ఈ అధ్యయనం ద్వారా వారు గుర్తించారు.ఆపిల్ పండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ప్రొలిఫరేటివ్ కార్యకలాపాలను నిర్వహించే గుణాలున్న కొత్త రకం ఫినాలిక్ పదార్ధాలను ఈ పరిశోధకులు గుర్తించారు. మానవ బ్రెస్ట్ కేన్సర్ కణాల్లో యాపిల్ పళ్లకు చెందిన ఫైటోకెమికల్ పదార్ధాల ముఖ్యమైన ఇన్ ఫ్లమేటరీ ప్రక్రియను (ఎన్ఎఫ్ కెబి) పరిశోధకులు గుర్తించారు. వ్యవసాయం, ఆహార రసాయనిక శాస్త్ర పత్రికలో ఈ పరిశోధనా ఫలితాలను ప్రకటించారు.
Pages: -1- 2 News Posted: 18 February, 2009
|