'ఫస్ట్ నైట్' పీడకలే!
న్యూఢిల్లీ: 'శోభనం రాత్రి' అన్నది నవ దంపతులకువారి జీవితాంతం చిరస్మరణీయంగా ఉండాలన్నది పెద్దల ఆకాంక్ష. అయితే చాలా మందికి, ముఖ్యంగా నవ వధువులకు, అసలు తొలి రాత్రే ఒక పీడకలగా పరిణమిస్తోంది. వివాహిత యువతలో 'శోభనం రాత్రి' జరిగే శారీరక, లైంగికపరమైన హింసపై ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 18 శాతం నుంచి 30 శాతం మంది మహిళలు శారీరక హింసకు, 10 శాతం నుంచి 54 శాతం మంది సెక్సువల్ హింసకు గురవుతున్నారని వెల్లడైంది. దేశంలోని తూర్పు, ఉత్తరాది ప్రాంత రాష్ట్రాలలో 49 శాతం మంది యువతులు శోభనం రాత్రి తాము బలవంతంగా సెక్స్ లో పాల్గొన్నట్లు చెప్పారు. పశ్చిమ, దక్షిణ ప్రాంత రాష్ట్రాలలో 23 శాతం మంది మహిళలు తమ కాళరాత్రి అనుభవాల గురించి వివరించారు.
ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్), ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ కలసి సంయుక్తంగా ఆంధ్ర ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో రెండు సంవత్సరాల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. 14 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉన్న 13,912 మంది యువ వివాహితలలో కనీసం 30 శాతం మంది తమ జీవిత కాలంలో ఒకసారైనా శారీరక హింసకు గురైనట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
రాజస్థాన్ లోనే ఈ విధమైన హింస అత్యల్ప స్థాయిలో ఉన్నట్లు నమోదైంది. మహారాష్ట్రలో ఇంటర్వ్యూ చేసిన 1947 మంది మహిళలలో దాదాపు 27 శాతం మంది 'శోభనం రాత్రి' తాము చెప్పలేనంత శారీరక హింసను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం దేశంలోకెల్లా మహారాష్ట్రకు భర్తలే 'శోభనం రాత్రి' తమ భార్యలను సెక్సువల్ గా హింసించిన వారిలో అగ్రస్థానం సంపాదించారు. ఆ తర్వాత ఆ జాబితాలో బీహార్, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు చోటు సంపాదించాయి. ఆ రాష్ట్రాల మహిళలలో దాదాపు 23 శాతం మంది తాము భరించలేనంత శారీరక హింసకు లోనైనట్లు తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 19 February, 2009
|