'ఫస్ట్ నైట్' పీడకలే!
అయితే, వివాహమైన తొలి సంవత్సరంలోనే మొదటిసారి హింసకు గురైనట్లు మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో 14 శాతం మంది మహిళలు చెప్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇతర రాష్ట్రాలలో ఇటువంటి వారి శాతం సగటున 9-7 శాతం ఉంది. మహారాష్ట్రలో దాదాపు 23 శాతం మంది మహిళలు తొలి రాత్రి భర్తలు తమతో బలవంతంగా సెక్స్ జరిపినట్లు తెలియజేశారు. పురుషుల విషయంలో ఇది నాలుగు శాతం మాత్రమే ఉంది.
'పట్టణ ప్రాంతాలలోని విద్యాధిక దంపతులలో సైతం ఇదే విధమైన ఫస్ట్ నైట్ హింస చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది' అని పాపులేషన్ కౌన్సిల్ సీనియర్ అసోసియేట్ ఎస్.జె. జీజీభాయ్ వ్యాఖ్యానించారు. 'సాధారణంగా జనం విశ్వసిస్తున్నట్లుగా ఇండియాలో వివాహం గాని, గర్భం దాల్చడం గాని మహిళలకు రక్షణాత్మక అంశం కావడం లేదు' అని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ (ఎన్ఐఆర్ఆర్ హెచ్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బాలయ్య దొంత పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 19 February, 2009
|