కలల బేబీ ఇక సాకారం
లాస్ ఏంజెల్స్: అడాల్ప్ హిట్లర్ కలలు నిజం కాబోతున్నాయి. 'స్పాప్నిక జాతి' (dream race) ని సృష్టించాలన్న హిట్లర్ కలల్ని లాస్ ఏంజెల్స్ లోని ఒక ఫెర్టిలిటీ క్లీనిక్ నిజం చేయనుంది. 1978లో సృష్టించిన తొలి టెస్ట్ ట్యూబ్ బేబి లూయిస్ బ్రౌన్ ప్రాజెక్టులో కీలక పాత్ర నిర్వహించిన శాస్త్రవేత్త డాక్టర్ జెఫ్ స్టెయన్ బెర్గ్ నడుపుతున్న ది లాస్ ఏంజెల్స్ ఫెర్టిలిటీ ఇన్ స్టిట్యూట్ తొలి 'డిజైనర్ బేబి'ని వచ్చే ఏడాది ప్రసవించనున్నట్లు ప్రకటించింది.
ప్రీ ఇంప్లెమెంటేషన్ జనటిక్ డయోగ్నసిస్ (పిజిడి) పద్దతిని వినియోగించి తొలి 'డిజైనర్ బేబి'ని రూపొందించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ పద్ధతి ద్వారా బిడ్డకు సంబంధించిన లింగం, చర్మం, కళ్లు, జుట్టు రంగు లాంటి పలు శారీరక అంశాలను తల్లిదండ్రులే ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) సేవలను పొందే దంపతులకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆ క్లీనిక్ తెలిపింది. న్యూయార్క్, మెక్సికోల్లో ఈ క్లీనిక్ కు శాఖలున్నాయి. తాము కోరుకున్న శారీరక లక్షణాలున్న బిడ్డను పొందేందుకు 18వేల డాలర్లు ఖర్చవుతాయి.
Pages: 1 -2- News Posted: 4 March, 2009
|