కలల బేబీ ఇక సాకారం
ఇలాంటి వైద్య సేవల కోసం చాలా మంది దంపతులు క్యూ కట్టారు. ఈ క్లీనిక్ ఇప్పటికే పిజిడి టెక్నిక్ ను 99 శాతం ఖచ్చితత్వంతో లింగపరమైన ఎంపికలో వినియోగిస్తోంది. నూటికి నూరు శాతం హామీలను సైతం ఈ క్లీనిక్ ఇస్తోంది. ఈ టెక్నిక్ ను ఇప్పుడు జన్యుపరమైన ఇతర అంశాలను ఎంపిక చేసుకునేందుకు కూడా ఈ క్లీనిక్ విస్తరించింది. పిండాలకు దీర్ఘకాల వ్యాధి లక్షణాలు వచ్చిన విషయాన్ని నిర్ధారించుకునే విషయంలో పిజిడి టెక్నిక్ ను 1990ల నుండి వినియోగిస్తున్నారు. తప్పుడు జన్యువులతో ఏర్పడిన పిండాలను తొలగించేందుకు ఈ టెక్నిక్ ను వినియోగించేవారు.
ఈ పిజిడి టెక్నిక్ ద్వారా లేబొరేటరీలోనే పిండాలను రూపొందించేందుకు వినియోగిస్తారు. మూడు రోజులు వయసుండే పిండాల నుండి ఒక జీవ కణాన్ని తీసుకుని లేబోరేటరీలో దాని నిర్మాణాన్ని విశ్లేషిస్తారు. ఈ జీవ కణంలోని క్రోమోజోములు సవ్యంగా లేకపోతే ఆ పిండాన్ని పారేస్తారు. జన్యు పరమైన లోపాల్ని కనుగొనేందుకే కాకుండా జన్యు పరమైన ఎంపికకు కూడా ఈ పిజిడి టెక్నిక్ ను ఈ క్లీనిక్ వినియోగిస్తోంది. 1970ల్లో ఐవిఎఫ్ పద్ధతిలో నిష్ణాతుడైన స్టెయిన్ బెర్గ్ అల్బినిజం లాంటి జన్యుపరమైన అంశాలను గుర్తించడమే కాకుండా కంటి రంగును రూపొందించేందుకు కూడా ఈ పద్దతిని మా క్లీనిక్ వినియోగిస్తుందని తెలిపారు. కళ్లు, జుట్టు, చర్మంలో మెలనిన్ పిగ్మెంట్ లేకపోవడమేనన్న జన్యుపరమైన రుగ్మతను అల్బినిజం అంటారు. పిజిడి పద్దతి ద్వారా జన్యుపరమైన రుగ్మతల నుండి పిల్లల్ని కాపాడుకోవచ్చని స్టెయిన్ బెర్గ్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 4 March, 2009
|