వజ్ర ఖచిత అభ్యర్థి!
సురేంద్రనగర్ లోని తన ఎన్నికల కార్యాలయానికి వచ్చే ప్రతి వ్యక్తితో పటాడియా చెప్పే విషయం ఒకటే. 'నా రూ. 514 కోట్ల ఆస్తులు నన్ను 'నిజంగా నిజాయితీపరుడైన' ఎంపిని చేయగలవు. నా సంపదే ఈ నియోజకవర్గం ఆరోగ్యం. ఇది ఇక్కట్లను నిర్మూలిస్తుంది. ఈ జిల్లాలో వాటికి కొరత ఏమీ లేదు. మంచినీటి కొరత నుంచి వేలాది మంది ఉప్పు కొటార్ల కార్మికుల పేదరికం వరకు, సంక్షుభిత సెరామిక్ పరిశ్రమ నుంచి దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్న రైతుల వరకు అందరూ కష్టాలను ఎదుర్కొంటున్నారు' అని ఆయన చెబుతుంటారు.
ఊకదంపుడు ప్రసంగాలతో తన సమయం వృథా చేయనని పటాడియా చెబుతుంటారు. తన క్రాంతికారి జైహింద్ సేన (కెజెఎస్) పార్టీ 'లక్ష్యాన్ని' పటాడియా విశదపరిచే సిడిలు ఆయన ఆఫీసు నిండా ఉన్నాయి. 'వీటిని ఆ గ్రామస్థులకు చూపించండి' అని పటాడియా తన ఆఫీసుకు వచ్చిన ఒక యువకునికి కొన్ని సిడిలను ఇస్తూ కోరారు. 'లోకో నే అలగ్ - అలగ్ మల్వా కర్తా అవి సంస్థ నె పకడీ అండ్ ఎమ్ని వత్ కరీ తో కామ్ థే. ఆ సంస్థ జోడె 50,000 ఓట్ చె' (స్వయంగా ప్రజల ఓట్లు సంపాదించేందుకు వారిని కలుసుకునే బదులు సంస్థలను సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించడంలోనే నాకు విశ్వాసం ఉన్నది) అని పటాడియా తన సెల్ లో సురేంద్రనగర్ కాటన్ సీడ్స్, కాటన్ ఆయిల్ అసోసియేషన్ నాయకునితో మాట్లాడిన అనంతరం చెప్పారు. 'ఈ అసోసియేషన్ అధీనంలో 50 వేల ఓట్లు ఉన్నాయి' అని ఆయన నవ్వుతూ చెప్పారు. వివిధ భాషలతో కూడిన ఆయన వెబ్ సైట్, సిడిలో వివరించిన పటాడియా 'లక్ష్యం' అత్యంత ఆడంబర జనాకర్షక నాయకుని సిగ్గుతో తలదించుకునేట్లు చేస్తుంది.
Pages: -1- 2 -3- News Posted: 24 April, 2009
|