వజ్ర ఖచిత అభ్యర్థి!
17 అంశాల కార్యక్రమంతో కూడుకున్నది ఆయన 'లక్ష్యం'. అన్ని విధాలా ఆదాయం పన్ను రద్దు, అందరికీ ఉచితంగా గృహవసతి, విద్య, వైద్య సహాయం, విద్యుత్ సౌకర్యం కల్పన, ప్రతి ఒక్కరికీ కిలో రూ. 4 రేటుకు ఆహారధాన్యాల సరఫరా, రవాణా, ఇంధన ఖర్చులు ఆదా చేయడానికై ఉద్యోగులకు వారు పనిచేసే ప్రదేశాలలోనే గృహవసతి కల్పించేందుకై ప్రభుత్వాన్ని, ప్రైవేట్ రంగాన్ని 'ప్రోత్సహించడం' వంటివి వాటిలో కొన్ని.
దీనిపై ఆయన ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సిట్టింగ్ ఎంపి లాల్జీ మెర్ వ్యాఖ్యానిస్తూ, 'ఎన్నికలను డబ్బుతో గెలుచుకునేటట్లయితే, టాటాలు, బిర్లాలు ఎంపిలు అయి ఉండేవారు. ఆయనకు 8000 పైచిలుకు ఓట్లు వస్తే నేను ఆశ్చర్యపోతాను' అని అన్నారు. స్థానిక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఘన్ శ్యామ్ సింహ్ జలా మాట్లాడుతూ, 'మేము ఆయనను అసలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో బిజెపితో పోరుపైనే మేము దృష్టి కేంద్రీకరించాం' అని చెప్పారు. అయితే, పటాడియా ఇందుకేమీ ఆశ్చర్యపోవడం లేదు. 'వేచి చూడండి. నాకు ఇక్కడ అధికంగా ఓట్లు రానున్నాయి' అని ఆయన సిడిలను అక్కడే వదలి తన కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతూ చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 24 April, 2009
|