కిట్టూలు, బిట్టూలు..
చండీగఢ్ : ఎవరైనా రాజకీయ ప్రముఖుడు తనను 'టైనీ'గా పరిచయం చేసుకున్నప్పుడు లేదా పొడుగాటి గడ్డం ఉన్న నాయకుడు తనను తాను 'గోల్డీ'గా పేర్కొన్నప్పుడు మీరు పంజాబ్ లో రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నట్లే. కిట్టూ, బిట్టూ, బోనీ, బన్నీ, గోల్డీ, చన్నీ, బిబా, డింపా, టిన్నూ వంటి పేర్లు ఏదైనా కిండర్ గార్టెన్ లోని రిజిస్టర్ లోని పేర్లు కావు. అవి పంజాబ్ లో అభ్యర్థులు పెట్టుకున్న ముద్దు పేర్లు (నిక్ నేమ్ లు).
ఇంటి పేర్లకు చాలా వరకు వారి వారి స్వగ్రామాలే ఆధారం అవుతుంటాయి. ఉదాహరణకు ప్రతాప్ సింగ్ కైరాన్, ప్రకాశ్ సింగి బాదల్ లేదా రాజీందర్ కౌర్ భట్టాల్. ఇక స్వర్గీయ బియాంత్ సింగ్ లేదా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి వారు మామూలుగా సింగ్ అనే పేరుతో సరిపెట్టుకుంటారు.
సాధారణంగా కులమే రాజకీయ జీవితాన్ని వృద్ధి చేయవచ్చు లేదా దెబ్బ తీయవచ్చు. కాని పంజాబ్ లో చాలా మంది రాజకీయ నాయకులు తమ సాంప్రదాయక ఇంటి పేర్లను తొలగించి మరింత సార్వత్రికమైన, యౌవనాన్ని సూచించే ముద్దుపేర్లను వాడుకలోకి తీసుకువస్తున్నారు. ఇవి వారిని అందరికీ సుపరిచితులను చేయడమే కాకుండా గుర్తుపెట్టుకోవడానికి కూడా తేలికగా ఉంటాయి. పైగా కులాలను గుర్తు చేయవు.
Pages: 1 -2- News Posted: 9 May, 2009
|