కిట్టూలు, బిట్టూలు..
జనాభాలో 32 శాతం మందికి పైగా షెడ్యూల్డ్ కులాలవారు ఉన్న రాష్ట్రంలో కులం గుర్తింపు ఏదీ లేకుండానే 'హ్యాపీ' వంటి పేరుతో పరిచయం కావడం తెలివైన పని కదా! కొన్ని మరీ పిల్లల పేర్లుగా కనిపించినప్పటికీ బల ప్రదర్శనకు ముద్దుపేర్లు అంతగా అడ్డంకి కావు. భటిండా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కుమారుడు రాణిందర్ సింగ్ స్నేహితులకు టిక్కూగాను, కాంగ్రెస్ వారికి టిక్కూజీగాను పరిచితుడు. ఆయన పటియాలా రాజ కుటుంబంలో 13వ తరం వాడు. ఆ హోదాకు తగినట్లుగానే కాంగ్రెస్ వారు పేరుకు చివర జీ అనే పదం తగిలించారు.
ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ భార్య, భటిండాలో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఎడి) అభ్యర్థి హర్ సిమ్రత్ కౌర్ బిబా జీగానే అందరికీ తెలుసు. దీనితో భటిండాలో పోరు టిక్కూజీకి బిబాజీకి మధ్య సాగుతున్నట్లయింది. ఇక సుఖ్వీందర్ సింగ్ 'డేనీ' ఫరీద్ కోటలో కాంగ్రెస్ అభ్యర్థి. ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి 'నిట్టూ'గా అందరికీ పరిచితుడు. ఆనందపూర్ సాహిబ్ లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు, కాంగ్రెస్ అభ్యర్థి రవ్నీత్ సింగ్ 'బిట్టూ'నే అందరికీ తెలుసు.
కాగా, ఆకర్షణీయమైన ముద్దు పేర్లు పెట్టుకునే సంప్రదాయం సిట్టింగ్ ఎంఎల్ఎలలో కూడా కనిపిస్తున్నది. లవ్ కుమార్ 'గోల్డీ' (గఢ్ శంకర్), 'కాకా' రణదీప్ సింగ్ (నాభా). మరొక శాసనసభ్యుడు సుఖ్ పాల్ సింగ్ (ఫిరోజ్ పూర్) 'నాన్నూ'గానే సుపరిచితుడు. అకాలీ దళ్ మాజీ ఎంఎల్ఎ ఫరీద్ కోటకు చెందిన కుశల్ దీప్ సింగ్ ధిల్లాన్ ను చండీగఢ్ లోన ఆయన మిత్రులు 'కీకీ'గా పేర్కొంటుంటారు. ఇక పంజాబ్ రవాణా శాఖ మంత్రి 'మాస్టర్' మోహన్ లాల్ గానే అందరికీ తెలుసు. ఆయన పూర్వాశ్రమంలో ఒక టీచర్.
Pages: -1- 2 News Posted: 9 May, 2009
|