'బోగస్' ఏరివేతకు బృందాలు
జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ పక్కా గృహాల పూర్తికి అదనంగా 20 వేల రూపాయలు వెచ్చించి గృహ నిర్మాణ సంస్థ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. జిల్లాలో 55 వేల పక్కా గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఏడు వేల మందికి ఇళ్ళ స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. వరంగల్ కార్పొరేషన్ జనగామ మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు.
నలభై వేల జనాభా మించిన పంచాయతీలను పట్టణాలుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారని చెప్పారు. ఈ మేరకు జిల్లాలో నాలుగైదు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు జనాభా లెక్కలను పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రం భూపాలపల్లి పరకాల మేజర్ పంచాయతీ, మహబూబాబాద్ మేజర్ పంచాయతీతో పాటు ఇంకా ఏమైనా దీని పరిధిలోకి వస్తాయా అని పరిశీలించాల్సి ఉందన్నారు. నక్సల్స్ ప్రభావం ఉన్న గిరిజన తండాల యువకులకు ఉపాధి అవకాశాల కల్పించడానికి డిఆర్ డిఎ, పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మేడారం జాతర ఏర్పాట్లను డిసెంబర్ లోగా పూర్తిచేయడానికి జూలై నుంచి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాకతీయ ఉత్సవాలు, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈ సంవత్సరంలో నిర్వహించాల్సి ఉందన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు రెండు మూడు లక్షల రూపాయల పెట్టుబడులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. రక్షిత మంచినీటి సరఫరా ద్వారా సీజనల్ వ్యాధుల ప్రబలకుండా నిరోధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీరాంరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి జోసఫ్ పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 30 June, 2009
|