గ్రామీణ విలేఖరులకు శిక్షణ
ఎపియు డబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు డి.సోమసుందర్ మాట్లాడుతూ పత్రికలు, న్యూస్ ఛానళ్ళ సంఖ్య ఘణనీయంగా పెరగడం మూలంగా జర్నలిజం ఒక ఇండస్ట్రీగా మారిందన్నారు. రాష్ట్రంలో 25 వేల మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని వీరికి ఆయా సంస్థలు వృత్తిపరమైన శిక్షణ ఇప్పించే ప్రయత్నాలుచేసిన ధాఖలాలు లేవని సోమసుందర్ అన్నారు. ప్రమాణం లేని వార్తలు సమాజంలోకి వెళితే జరిగే నష్టాన్ని నివారించడానికి ప్రెస్ అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి శిక్షణా తరగతలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రెస్ అకాడమీ అనుభవజ్ఞులైన వారితో శిక్షణా తరగతలు నిర్వహించడం హర్షనీయమనీ, వృత్తి నైపుణ్యంతో పాటు నేర్పరితనం ఎంతో అవసరమని కంకట రాజారాం అన్నారు.
ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.అమర్ నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లాల వెంకటరమణఆ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుమాదవ్, పాలకుర్తి నియోజక వర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టి కృష్ణారెడ్డి, కోశాధిగారి రెహమాన్, జిల్లా కోశాధికారి ఎం సుధాకర్ రావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గ్డిపల్లి మధు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ముందు ఇటీవల కాలంలో అకాల మృతి చెందిన నలుగురి జర్నలిస్టుకు సంతాప సూచకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ప్రెస్ అకాడమీ జిల్లా చైర్మన్ ను పాలకుర్తి నియోజక వర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువ, మెమోంటోలతో సత్కరించారు.
Pages: -1- 2 News Posted: 11 July, 2009
|