బలితీసుకున్న 'గోత్రం' వీరేందర్ సింగ్ పై సోన్ పట్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2007 జనవరిలో... అప్పటికింకా వీరేందర్ జైలులో ఉండగానే... శైలజకు బలవంతంగా పెళ్ళి చేశారు. హర్యానాలోని జింద్ సమీపంలోని తెలిఖేర గ్రామానికి చెందిన జైపాల్ తో శైలజకు ఈ పెళ్ళి జరిగింది. అయితే శైలజ గతం తెలిసిన అతను వేధించడం ప్రారంభించాడు. దీనిపై జింద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. నిరాశకు గురైన ఆమె... ఆ సమయంలో బెయిల్ పై విడుదలైన వీరేందర్ ను కలిసింది. వారిద్దరూ తిరిగి ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు. జైపాల్ ను శైలజ వదిలేసి వచ్చింది. 2008 ఆగస్టు 8న చండిగఢ్ లోని ఒక ఆలయంలో వారిద్దరూ వివాహం చేసుకుని... సమాల్ఖలో కాపురం పెట్టారు. వారిద్దరి ఆచూకీ కనుగొన్న శైలజ తండ్రి దయాసింగ్... వీరేందర్ ను చంపుతానని బెదిరించాడు.
ఇదే సమయంలో 'భార్య చేసిన' అవమానాన్ని భరించలేని జైపాల్ తన భార్యను వీరేందర్ అపహరించాడని జింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరిగి తనను అరెస్ట్ చేస్తారని భయపడిన వీరేందర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి పరిస్థితిని వివరించారు. తామిద్దరూ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు చెప్పినా ఫలితం లేకపోయింది. వీరేందర్ ను అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని అనుమానించిన శైలజ... ఇంటికి వెళ్ళేందుకు నిరాకరించి, స్థానికంగా ఉన్న నారీ నికేతన్ లో కొంతకాలం ఉంది. తన సమ్మతితోనే వీరేందర్ తో వచ్చానని శైలజ స్పష్టం చేయడంతో... చివరకు అతనిపై కేసు రద్దయింది.
Pages: -1- 2 -3- News Posted: 28 October, 2009
|