బలితీసుకున్న 'గోత్రం' ఈ నేపథ్యంలో ఈనెల 17న దీపావళినాడు శైలజ జీవితంలో అంథకారాన్ని మిగిల్చేందుకు తండ్రే కుట్ర పన్నాడు! వీరేందర్ ను అతని స్నేహితుడు ఇందర్ జిత్ దీపావళి పండగను సందీప్ ఇంట్లో జరుపుకుందామని ఆహ్వానించాడు. ఢిల్లీ సమీపంలోని నారెలాలో గల సందీప్ ఇంటికి శైలజ దంపతులు హాజరయ్యారు. రాత్రి 10.30 గంటల సమయంలో శైలజ తండ్రి దయాసింగ్ అక్కడకు వచ్చాడు. అతని వెంట కొడుకు, మేనల్లుడు కూడా ఉన్నారు. అక్కడే వీరేందర్ ను వారంతా తీవ్రంగా కొట్టి, ఊపిరాడకుండా చేసి చేంపేశారని ఆరోపణ. అరాచకం అంతటితో ఆగలేదు. మరో గదిలో శైలజపై సందీప్, ఇందర్ జిత్ లు అత్యాచారం చేశారు. వీరేందర్ శవాన్ని సందీప్ కారులో తీసుకుపోయి, మెడకు రాయి కట్టి మరీ కాలువలో పారేశారు. బాధితురాలు శైలజను నారెలలోని గదిలో బంధించి, తిరిగొస్తే చంపేస్తామని హెచ్చరించారు. 22వ తేదీ వరకు నిర్భంధంలో ఉన్న శైలజ... ఎలాగోలా తప్పించుకొని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడంతో జరిగిన ఘోరం వెలుగుచూసింది. డీసీపీ కతియార్ మాట్లాడుతూ, శైలజ మొదటి భర్త జైపాల్ పై కూడా నిఘా వేశామన్నారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల పాత్రను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇంకా తేరుకోని బాధితురాలిని మామూలు మనిషిని చేసేందుకు తగిన కౌన్సెలింగ్ ఇస్తున్నారన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 28 October, 2009
|