ఎస్సెమ్మెస్ రేట్ల లోగుట్టు!
న్యూఢిల్లీ : మీ ప్యాకేజీని బట్టి ఎస్ఎంఎస్ కు 50 పైసలు నుంచి ఒక రూపాయి వరకు చెల్లిస్తున్నారా? అలా అయితే, మీ సందేశాన్ని మరొక మొబైల్ నెట్ వర్క్ కు పంపడానికి మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు అయ్యే ఖర్చు ఒక పైసా కన్నా తక్కువే. సగటు ఎస్ఎంఎస్ ఒక కెబి డేటాతో కూడుకుని ఉండడం ఇందుకు కారణం. ఈ సందేశం రవాణాకు, ముగింపునకు పట్టే వ్యవధి ఒక సెకన్ లో కొంత భాగమే.
ప్రపంచంలో అత్యల్ప టెలికామ్ టారిఫ్ లు ఉన్న దేశాలలో ఇండియా ఒకటనే ప్రకటన నిజం కాదని దీని వల్ల విదితమవుతున్నది. ఎస్ఎంఎస్ రేట్లు బాగా పడిపోవడానికి ఇది దారి తీయవచ్చు. వాయిస్ కాల్స్ కు ఇప్పటికే సెకన్ కు ఒక పైసా రేటు ఆఫర్ చేస్తున్నారు. కొత్త టెలికామ్ సంస్థలు మార్కెట్ లోకి ప్రవేశిస్తుండడంతో భారతీయ మొబైల్ సేవల పరిశ్రమలో ఇప్పటికే సాగుతున్న ధరల పోరు మరింత ఉధృతం కావచ్చు.
భారతీయ టెలికామ్ పరిశ్రమ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయలతో పాటు, రెవెన్యూలో పది శాతాన్ని ఎస్ఎంఎస్, ఇతర విలువ ఆధారిత సేవలు ఆక్రమిస్తున్నాయి. ఇంకా, టెలికామ్ ఆపరేటర్లు 'బిల్లు వసూలు చేసి అట్టిపెట్టుకోండి' అనే విధానాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఈ విధానంలో ఎస్ఎంఎస్ కోసం బిల్లు వేసే ఆపరేటర్ ఆ డబ్బు వసూలు చేస్తారు కాని ఎస్ఎంఎస్ పంపే నెట్ వర్క్ కు అసలేమీ చెల్లించరన్నమాట. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది నెట్ వర్క్ ల మధ్య ట్రాఫిక్ దాదాపు సమానంగా ఉంటున్నది. రెండవది. ముగింపు వ్యయం నామమాత్రం.
Pages: 1 -2- -3- News Posted: 10 November, 2009
|