ఎస్సెమ్మెస్ రేట్ల లోగుట్టు!
'సెల్ ఫర్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వొకసీ' (సిసిఇఎ) చైర్మన్ బేజన్ మిశ్రా మాట్లాడుతూ, 'ప్రపంచంలోనే అత్యంత తక్కువ టారిఫ్ లు ఉన్న ఘనత మనదేనన్న ఇండియా ప్రకటన నిజం కాదని ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. వ్యయ ఆధారిత టారిఫ్ లను నిర్ణయించకుండా నివారించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత సంస్థలు ఒక కూటమిగా ఏర్పడకుండా అడ్డుకోవడానికి ట్రాయ్ తక్షణం జోక్యం చేసుకోవాలి' అని అన్నారు.
మరి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ) విభిన్నాభిప్రాయంతో ఉండడంలో ఆశ్చర్యం లేదు. సిఒఎఐ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ టి.ఆర్.దువా మాట్లాడుతూ, 'ట్రాయ్ సహిష్ణుత విధానాన్ని అనుసరిస్తున్నది. అదే సంస్థ విధానం కావాలి' అని పేర్కొన్నారు. ఎస్ఎస్ఎస్ ముగింపునకు సంబంధించిన సిసలైన ఖర్చులపై వ్యాఖ్యానించడానికి ప్రస్తుత సంస్థలు అనేకం నిరాకరించాయి. కాని భారీ మార్జిన్ ఉంటున్నదని అవి అంగీకరించాయి.
యూనిటెక్ వైర్ లెస్ సంస్థ ఎండి స్టెయిన్-ఎరిక్ వెల్లన్ మాట్లాడుతూ, 'ఖర్చు ఆధారిత ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జ్ (ఐయుసి) లేకపోవడం న్యాయమైన, స్వేచ్ఛాయుత పోటీని అడ్డుకుంటున్నది. ఈ పరిస్థితిని సరిదిద్దవలసిన అవసరం ఉంది. వాయిస్ కాల్స్ కు సంబంధంచి ఐయుసి చార్జీలను 30 పైసల నుంచి 20 పైసలకు తగ్గించేందుకు ఇంతకుముందు జోక్యం చేసుకున్నప్పుడు అందరికీ అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో తన సహిష్ణుత విధానాన్ని రెగ్యులేటర్ సంస్థ ట్రాయ్ అనుసరించింది. పరిశ్రమలో అందరికీ సమానావకాశాల కల్పన కోసం ట్రాయ్ మరొకసారి అటువంటి జోక్యం చేసుకోవాలి' అని అన్నారు. డిసెంబర్ లో సేవలు ప్రారంభించనున్న కొత్త సంస్థలలో యూనిటెక్ వైర్ లెస్ ఒకటి కావచ్చు.
పెక్కు కొత్త సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నందున జోక్యం చేసుకోవడం మినహా ట్రాయ్ కు మార్గాంతరం ఉండకపోవచ్చు. ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు టిఒఐ విలేఖరితో మాట్లాడుతూ, గత మార్చిలో చివరిసారిగా సమీక్ష జరిపినప్పుడు ఎస్ఎంఎస్ కు సంబంధించిన కొత్త టారిఫ్ విధానాన్ని భాగం చేయలేదని చెప్పారు. 'అయితే, కొత్త ఆపరేటర్లు మనుగడ సాగించడం, వృద్ధిలోకి రావడం అవసరం కనుక సమానావకాశాల కల్పన కోసం వారు కోరినట్లయితే మేము జోక్యం చేసుకుంటాం' అని ఆయన తెలిపారు.
అయితే, 2006 ఆగస్టులో ఐయుసిని నియంత్రించినప్పటి ట్రాయ్ డేటాను దృష్టిలోకి తీసుకుంటే అది ఫిర్యాదుల కోసం వేచి ఉండనక్కర లేదని, వెంటనే కచ్చితమైన చర్చ తీసుకోవాలని నిపుణులు, వినియోగదారుల హక్కుల సంఘాల నాయకులు వాదిస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 10 November, 2009
|