ఎస్సెమ్మెస్ రేట్ల లోగుట్టు!
'సహిష్ణుత ' (ఫర్బేరన్స్)గా పేర్కొంటున్న విధానం కింద కొన్ని ఇతర టారిఫ్ లతో పాటు ఎస్ఎంఎస్ టారిఫ్ లను క్రమబద్ధం చేయడానికి ట్రాయ్ ఇంతవరకు నిరాకరిస్తూన్నది. పోటీ మార్కెట్లు ఫరవాలేదని, టారిఫ్ లు సిసలైన ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయని తాము భావించినప్పుడు రెగ్యులేటర్లు సాధారణంగా అనుసరించే విధానం ఇది.
అసలు ఖర్చు కన్నా ఎంతో ఎక్కువగా ఉన్న ధరకు ఇప్పుడున్న ఆపరేటర్లతో ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలను కుదుర్చుకొనేట్లుగా కొత్త ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకువచ్చి ఉండకపోతే ఎస్ఎంఎస్ పంపేందుకు అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలిసి ఉండేది కాదు. కొత్తగా సర్వీసులు ప్రారంభించాలని అభిలషిస్తున్న అనేక మంది మాట్లాడుతూ, రెగ్యులేటరీ జోక్యం తక్షణావశ్యకమని దీని వల్ల విదితమవుతున్నదని అన్నారు. ఎస్ఎంఎస్ పంపే రేటు అసలు ఖర్చులను ప్రతిబింబించినట్లయితే ఇది కొన్ని పైసల కన్నా ఎక్కువగా ఉండదని వారు పేర్కొంటున్నారు.
కొత్త పోటీదారులను తీసుకురావడం ద్వారా టెలికామ్ రేట్లను తగ్గించాలని అనుకుంటున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ. రాజా చెబుతుండగా ఇప్పుడున్న ఆపరేటర్ల మధ్య పోటీ కారణంగాను, సరైన నియంత్రణ కొరవడిన కారణంగాను టెలికామ్ టారిఫ్ లకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూడడం గమనార్హం.
Pages: -1- 2 -3- News Posted: 10 November, 2009
|