కోటి కోరిన స్మోకర్ కాగా, ఐటిసి ప్రధాన కార్యాలయం ఉన్న కోలకతాలో సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఈ విషయమై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఢిల్లీలో ధూమపాన నిరోధక చట్టాలపై ప్రభుత్వ చర్యల పర్యవేక్షణకు దోహదం చేస్తున్న న్యాయవాది ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ, ఇండియాలో పొగాకుపై దావాలలో 'మేలి మలుపు కాగల అవకాశం' ఈ ముంబై కేసుకు ఉందని అన్నారు. 'మాకు తెలిసినంత వరకు పొగాకు వాడకం వల్ల కలిగే హానికి సంబంధించి ఇండియాలో ఎవ్వరికీ ఏ పొగాకు సంస్థా నష్టపరిహారం చెల్లించలేదు' అని పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్న ఎన్ జిఒ సంస్థ 'హృదయ్'కు చెందిన ఒక లీగల్ ఆఫీసర్ అమిత్ యాదవ్ చెప్పారు.
అయితే, అమెరికా, యూరోప్ దేశాలలో నిరంతర పొగాకు వాడకం వల్ల కలిగిన హానికి లేదా మరణానికి నష్టపరిహారంగా విస్తృత మొత్తాలను చెల్లించవలసి వస్తుంది. ఐదు సంవత్సరాల క్రితం, న్యూయార్క్ బ్రూక్లిన్ లో ఒక జ్యూరీ 44 సంవత్సరాల పాటు పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ తో `ఒక వ్యక్తి మరణిస్తే అతని భార్యకు 20 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. దీపక్ కుమార్ పిటిషన్ పై సోమవారం విచారణ జరుగుతుంది. పిటిషన్ ను కనుక విచారణకు స్వీకరిస్తే, ఐటిసికి నోటీసు జారీ చేస్తారు.
న్యాయవాద వర్గాల అభిప్రాయం ప్రకారం, పొగతాగే వ్యక్తి కచ్చితంగా వినియోగదారుడే. సేవలో లోపానికి అతను వినియోగదారుల వివాదాల కమిషన్ ను ఆశ్రయించవచ్చు. అయితే, కంపెనీ జాతీయ కమిషన్ కు అప్పీలు చేసుకోవచ్చు. ఆతరువాత కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు. కాని ఆ అప్పీలు ఆర్థికపరమైన క్లెయిముకు మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే, వినియోగదారుల కోర్టులో దాఖలయ్యే కేసు దేనినీ క్రిమినల్ కేసుగా పరిగణనలోకి రాదు.
Pages: -1- 2 -3- News Posted: 3 December, 2009
|