కోటి కోరిన స్మోకర్ సిగరెట్ ప్యాకెట్లపై ఇప్పుడు ముద్రిస్తున్న చట్టబద్ధమైన హెచ్చరిక సరిపోదని దీపక్ కుమార్ వాదిస్తున్నారు. 'ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి నిర్దుష్ట ఆరోగ్య సమస్యల గురించి, అనేక ఇతర ప్రాణాంతక వ్యాధుల గురించి వినియోగదారులకు ఇది సమాచారం అందజేయలేకపోతున్నది. అలవాట్లకు బానిసలను చేసే ఇతర పదార్థాల విషయంలో ప్రభుత్వం కఠిన నియంత్రణను, చట్టాలను అమలుపరుస్తున్నది. మరి సిగరెట్ల మాటేమిటి? పొగతాగేవారికి వాటిల్లే అపాయాలు, ముప్పును సూచించే విధంగా ప్రస్తుత హెచ్చరిక లేదు. ఇది బయటకు చెప్పే విషయం కన్నా దాచేదే ఎక్కువగా ఉంది' అని ఆయన పేర్కొన్నారు.
దీపక్ కుమార్ తన స్వరపేటిక తొలగింపు కోసం గత అక్టోబర్ లో ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. 'ఆయన గొంతుకు మేము అమర్చిన ప్రత్యేక సాధనం (ప్రోస్థీసిస్) సాయంతో ఆయన మాట్లాడుతున్నారు. అది చక్కగా పని చేస్తున్నది. అయితే, స్వరం కొంత యాంత్రికంగా ధ్వనించవచ్చు. ఆయన తన ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోలేరు కూడా. శ్వాస తీసుకోవడానికి వీలుగా ఆయన గొంతులో ఒక రంధ్రం చేశాం' అని దీపక్ కుమార్ కు చికిత్స చేసిన డాక్టర్ ప్రదీప్ చతుర్వేది తెలియజేశారు.
ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి ప్రోస్థీటిక్ సాధనాన్ని ప్రతి మూడు నెలలకు మారుస్తుండాలి. దీని ఖరీదు రూ. 15 వేలు, రూ. 20 వేలు మధ్య ఉంటుంది. దీని వల్ల తన ఆదాయానికి గండి పడుతోందని దీపక్ చెప్పారు. ముగ్గురు పిల్లలు ఉన్న దీపక్ ఇప్పటికీ ముంబైలోని తన కార్యాలయానికి విధి నిర్వహణ కోసం వెళుతున్నారు. 'పొగాకుకు లేదా క్యాన్సర్ కు వ్యతిరేకంగా నా పోరుకు స్వస్తి చెప్పాలని నేను అనుకోవడం లేదు' అని దీపక్ చెప్పారు. 'ఇండియాలో పొగాకు ఉత్పత్తులను అరికట్టేట్లుగా ప్రభుత్వ సంస్థలపై ఒత్తిడి తీసుకురావడం, పొగాకు కంపెనీలను జవాబుదారీగా చేయడం, పొగాకు వల్ల దుష్ప్రభావం గురించి జనాన్ని చైతన్యపరచడం లక్ష్యంగా నేను ఈ దావా వేశాను' అని దీపక్ కుమార్ చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 3 December, 2009
|