మరొక వైపు నైనా లాల్ కిద్వాయి తన కెరీర్ లో ఆదిలోనే తన సత్తా చాటారు. అప్పటి నుంచి ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారు. 28 ఏళ్ల వయస్సులో ఆమె ఎఎన్ జడ్ గ్రిండ్లేస్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ విభాగానికి సారథ్యం వహించారు. 2005లో హెచ్ఎస్ బిసిలో చేరిన తరువాత మూడేళ్లలోనే ఆమె ఈ బ్యాంకు భారతదేశ శాఖకు అధినేత్రి అయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి తమను తాము కాపాడుకోవడానికి భారత బ్యాంకింగ్ రంగం మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో అగ్ని పరీక్షకు తట్టుకుని నిలబడిన బ్యాంకర్లలో ఆమె ఒకరు.
ఈ జాబితాలోని మరొక బ్యాంకరు మీరా సన్యాల్. ఆమె బోర్డ్ రూమ్ నుంచి బ్యాలట్ బాక్స్ కు వెళ్లారు. ఎఎన్ జడ్ గ్రిండ్లేస్ బ్యాంకులో తన కెరీర్ ప్రారంభించిన మీరా సన్యాల్ 2002లో ఎబిఎన్ ఆమ్రోలో చేరారు. కొన్ని సంవత్సరాలలోనే ఆమె తమ సంస్థ భారతదేశ శాఖకు సారథిగా బాధ్యతలు స్వీకరించారు.
2009లో దేశంలో అనేక మంది మహిళలు 'ఫార్చ్యూన్ 500' జాబితాలోని వివిద ఆర్థిక సంస్థలలో ఉన్నత పదవులు అధిష్ఠించినప్పటికీ ఏడు శాతం మహిళా సిఇఒలు మాత్రమే ఆర్థిక రంగానికి చెందినవారు. ఈ కొద్ది మంది సంక్షుభిత పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొని ఆశాజ్యోతులుగా నిలవడం హర్షణీయం.