ఐపిఎల్ 3కి అంతా సిద్ధం ముంబై : క్రికెట్ క్రీడపై అమిత వ్యామోహం గల భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీ లీగ్ టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఇప్పటికే భారీ స్థాయి టోర్నమెంట్. ఇది మరింత బృహత్ రూపం సంతరించుకోబోతున్నది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఐపిఎల్ మూడవ సీజన్ లో దక్కన్ చార్జర్స్ (డిసి), కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్లు ఢీకొంటున్న తొలి మ్యాచ్ ను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ముంబై మురికివాడలలోని టీ షాపుల నుంచి విలాసవంతమైన ఢిల్లీ శివార్ల వరకు, ఈమధ్యలో గల వేలాది గ్రామాలలో కోట్లాది మంది ప్రజలు టివిల ముందు ఆశీనులు కానున్నారు.
'మొదటి రెండు సీజన్లు క్రికెట్ వినోదానికి పరాకాష్ఠగా ఎవరైనా భావించి ఉంటే వారు అటువంటిది ఇంకా వీక్షించలేదని అర్థం' అని 'ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్' పత్రిక వ్యాఖ్యానించింది.
ఐపిఎల్ కులాలు, వర్గాలు, ఆదాయాల మధ్య అడ్డుగోడలను ఛేదిస్తుంటుంది. కోలకతాలోని విశిష్టమైన టోలీగంజ్ క్లబ్ లో సిబ్బంది కొన్ని గంటల పాటు విరామం తీసుకుంటారు. సభ్యులు తాము ఆడుతున్న గోల్ఫ్, స్క్వాష్, రైడింగ్ క్రీడలను నిలిపివేస్తారు. మెయిన్ బార్ గోడపై గల భారీ తెరపై ప్రదర్శితమయ్యే ఉత్కంఠభరిత ట్వంటీ20 మ్యాచ్ లను కస్టమర్లు, సిబ్బంది వీక్షిస్తారు. 'ఎవరు గెలుస్తారన్నది ప్రధానం కాదు. ఆటే ప్రధానం' అని చీఫ్ స్టెవార్డ్ సజాద్ మండల్ చెప్పారు. ఇక, మండల్ తన కోసం తీసుకువచ్చిన సాఫ్ట్ డ్రింక్ ను సేవిస్తున్న పది సంవత్సరాల అన్వమ్ నాజ్ పాల్ కు ఈ టోర్నమెంట్ అప్పుడే ప్రారంభమైంది. అతను చదువుతున్న ప్రైవేట్ స్కూలులో కేవలం పది ఓవర్లు ఆడే మినీ ఐపిఎల్ ఇప్పటికే మొదలైంది. అతను దక్కన్ చార్జర్స్ అభిమాని. కాని అతని తండ్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ (డిడి)కి మద్దతు ఇస్తుంటారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 11 March, 2010
|