ఐపిఎల్ 3కి అంతా సిద్ధం 'బాలీవుడ్ అంటే అభిమానం మెండు. క్రికెట్ ఒక మతం వంటిది' అని కామత్ పేర్కొన్నారు. 'మేము ఈ రెండింటినీ మిళితం చేస్తున్నాం. అయితే, మాకు ఆసక్తి ఉన్నది క్రికెటర్లపైనే తప్ప క్రికెట్ పై కాదు' అని ఆయన వివరించారు.
అయితే, ఈ సీజన్ ఐపిఎల్ ఎంతగా పాపులారిటీ ఉన్నదైనా సమస్యారహితంగా మాత్రం లేదు. రెండు కొత్త ఫ్రాంచైజీ జట్ల ఎంపికను వాయిదా వేయవలసి వచ్చింది. ఎందుకంటే మూడు బిడ్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఉన్న ఎనిమిది జట్లకు సినీ ప్రముఖులు, వాణిజ్యవేత్తలతో కూడిన సంస్థలు నిధులు సమకూరుస్తున్న విషయం విదితమే.
ఇక టెలివిజన్ నెట్ వర్క్ లతో వివాదం తలెత్తింది. దీని వల్ల టోర్నమెంట్ కు ముందు ప్రచారం తగ్గిపోయింది. అల్ ఖైదా వంటి తీవ్రవాద సంస్థల నుంచి బెదరింపులు వచ్చాయి. ఈ బెదరింపులు ఎంత తీవ్రమైనవంటే వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారులు డజన్ల సంఖ్యలో లాభదాయకమైన తమ ఫీజులను వదలుకోవలసి వచ్చింది. (భద్రతాపరమైన భయాలతోనే క్రితం సంవత్సరం ఈ టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించిన విషయం విదితమే.)
అయితే, ఎంతో డబ్బు, ఉత్కంఠతో కూడుకున్నది ఐపిఎల్. టెలివిజన్ హక్కులు, స్పాన్సర్ షిప్ ఒప్పందాలు, వ్యాపారం, టిక్కెట్ల వసూళ్ళ ద్వారా అపారంగా లాభాలు వచ్చేఅవకాశాన్ని పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ కన్సల్టెంట్ల సంస్థ 'బ్రాండ్ ఫైనాన్స్' ఈ సీజన్ లీగ్ విలువ 2.6 బిలియన్ పౌండ్ల కన్నా ఎక్కువగా ఉంటుందని లెక్క కట్టింది. ఇది 2009 విలువకు రెట్టింపు. 'ఇప్పటికే ఈ ఊపు ప్రారంభమైంది. రెవెన్యూను సృష్టించే ఈ యంత్రం పూర్తి స్థాయిలో పని చేస్తున్నది' అని బ్రాండ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్ని కృష్ణన్ పేర్కొన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పోటీదారుల కన్నా ముందంజలో ఉండేందుకు లీగ్ చాలా కష్టపడవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Pages: -1- -2- 3 -4- News Posted: 11 March, 2010
|