ఐపిఎల్ 3కి అంతా సిద్ధం ఈ సీజన్ లో గూగుల్ తో ఒప్పందం కూడా కుదిరింది. దీనివల్ల మొట్టమొదటిసారిగా యూట్యూబ్ లో ఈ పోటీలను ప్రత్యక్షంగా ప్రసారం అవుతాయి. వేలాది మంది మల్టీప్లెక్స్ లు, స్థానిక థియేటర్లలో పోటీలను తిలకించేందుకు వీలుగా సినిమా థియేటర్ల యజమానులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
అయితే, మితిమీరిన వ్యాపారీకరణ తగదని భారత క్రికెట్ సీనియర్ అధికారులు హెచ్చరించారు. 'వీక్షక ప్రాధాన్యం ఉన్న క్రీడను ఎప్పుడూ ఒక క్రీడగానే పరిగణించాలి తప్ప వాణిజ్య వ్యవహారంగా కాదు' అని ఐపిల్ పాలక మండలి సభ్యుడు రాజీవ్ శుక్లా అన్నారు. కాని, ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి తన ఆశయాకాంక్షలేవో స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. 'ప్రపంచంలో ఆధిపత్యం వహించే క్రీడా లీగ్ గా రూపుదిద్దుకోగలమన్నది నా ఆశ' అని ఆయన చెప్పారు.
కాగా, టోలీగంజ్ క్లబ్ వెలుపల రిక్షా డ్రైవర్లు, కోలకతా నైట్ రైడర్స్ అభిమానులు చార్జీల కోసం వేచి ఉన్నారు. 'ఐపిఎల్ బ్రహ్మాండం' అని వారు ముక్తకంఠంతో అన్నారు. 'అమోఘం' అని వారన్నారు.
మరి శుక్రవారం రాత్రి వారు ఎక్కడ గడుపుతారు? ఎదురుగా పేవ్ మెంట్ పై గల చిన్న టీ, రోటీ స్టాల్ ను వారు చూపారు. అక్కడ మిణుకుమిణుకుమంటున్న బల్బులు, చౌక డిన్నర్ చేస్తున్న కొందరు కస్టమర్ల మధ్య ఒక షెల్ఫ్ పై అత్యంత విలువైన వస్తువు ఉంది. అదే టెలివిజన్.
Pages: -1- -2- -3- 4 News Posted: 11 March, 2010
|