ఐపిఎల్ 3కి అంతా సిద్ధం 'అయితే, మేము కలిసే చూస్తుంటాం' అని అతను చెప్పాడు. 'మా అమ్మగారికి అంత ఆసక్తి లేదు. కాని ఆమె మాతో కలసి చూస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల క్రికెటర్లు కలసి ఆడుతుంటే చూడడం నాకు నిజంగా చాలా ఇష్టం' అని అతను చెప్పాడు. అయితే, అంతటి విశాల ఆశయాలు అందరికీ ఉండవు. టోలీగంజ్ క్లబ్ లో చెఫ్ మైకేల్ వాట్సన్ కు ప్రధాన ఆకర్షణ చీర్ లీడర్లు. కాని అలా చీర్ లీడర్లను నియోగించాన్ని క్రికెట్ సనాతనవాదులు ఏవగించుకుంటుంటారు. 'ఐపిఎల్ సరదాగా సాగే, వినోదం' అని వాట్సన్ పేర్కొన్నారు. 'నాకు ఒక రోజు సెలవు,టిక్కెట్ లభిస్తే చాలని కోరుకుంటాను' అని ఆయన చెప్పారు.
శుక్రవారం మొదటి బంతి వేసే సమయానికి అత్యధిక సంఖ్యాక వీక్షకులు తమ టివి తెరలకు కళ్ళు అప్పగించి ఉంటారు. ఇక ఈ సంవత్సరపు ఐపిఎల్ కు సంబంధించి ట్రేడ్ మార్క్ హడావుడి మరింత పెరిగింది. ఈ ఆరు వారాల టోర్నమెంట్ ను నిర్వహించే భారత క్రికెట్ అధికారులు మ్యాచ్ కు ముందే పలు రకాల కార్యక్రమాలపై డీల్స్ కుదుర్చుకున్నారు.
హిందీలో వినోద కార్యక్రమాలు ప్రసారం చేసే 'కలర్స్' చానెల్ 'ఐపిఎల్ రాక్ స్టార్' అనే రియాల్టీ షోను రూపొందిస్తున్నది. క్రికెట్ మైదానాలలో క్రీడాకారులు అభ్యాసం చేస్తుండగా 13 మీటర్ల వేదికపై హీట్స్ లో పాల్గొనే పోటీదారులను ఈ కార్యక్రమంలో చూడవచ్చు. 'సూపర్ బౌల్ తరహా వినోదాత్మక వాతావరణం సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యం' అని కలర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ కామత్ చెప్పారు.
కలర్స్ చానెల్ తలపెట్టిన ఇతర కార్యక్రమాలలో ఒకటి 'ఐయామ్ ఎ క్రికెట్ సెలెబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే షో. ఇందులో 14 మంది క్రికెటర్లు తాము అతిగా భయపడే విషయం గురించి ప్ర్రస్తావిస్తారు. 'ది హిప్పెస్ట్ పార్టీస్'. 'ది హాటెస్ట్ ఫ్యాషన్ షోస్'తో కూడిన 'ఐపిఎల్ నైట్స్' కార్యక్రమాన్ని కూడా కలర్స్ ప్రసారం చేయనున్నది. వీటిలో తమ 'విభిన్న వేదికపై క్రీడా హీరోలు కలసి నృత్యం చేయడాన్ని' వీక్షకులు చూస్తారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 11 March, 2010
|