పట్టాలు తప్పిన గూడ్స్
వరంగల్ ః జనగామ రైల్వే స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రక్కనున్న వేరే గూడ్స్ రైలుపై ఏడు వ్యాగన్లు పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో హైదరాబాద్ - విజయవాడల మధ్య రైళ్ళ రాకపోకలు స్తంభించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రైల్వే అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్టేషన్లో ఉన్న ప్రయాణీకులను వారి వారి ప్రాంతాలకు చేరుకునేందుకు 20 బస్సులను ఏర్పాటు చేశారు.
News Posted: 9 February, 2009
|