'ఉపాది' సందర్శన
వరంగల్ : జిల్లాలోని ప్రతి గ్రామంలోఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించి కూలీలకు నిరంతరంగా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో ఏ స్థాయిలో ఐనా ఒక్కపైసా కూడా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని, కూలీలకు చెలలించవలసిన వేతనాలలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ చెరువులు పూర్తి చేయడంతో పాటు పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, సకాలంలో వేతనతం చెల్లింపు మరియు నాణ్యత ప్రమాణాలను విధిగా పాటించాలని, తద్వారా గ్రామాలలో మౌళిక సదుపాయాలు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
News Posted: 14 February, 2009
|