ఆదరించాలంటున్న వైఎస్
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత నేటి వరకు తెలంగాణలో రెండే థర్మల్ పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని, ఈ ప్రాంతం ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మరో రెండు ధర్మల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని గోదావరి తీరప్రాంతమైన కంతనపల్లిలో ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం గణపురం మండలం, చెల్పూరులో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి శంఖుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. పేదవాడికి సమస్యలు లేవు కనుకే నక్సల్స్ పార్టీలో చేరడం లేదన్నారు. రాష్ష్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్న మహాకూటమి నేతలపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు అడిగినవన్నీ తీరుస్తున్న కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలో చెప్పి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా సాగునీరు, ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్లు, జాతీయ ఉపాధి పథకంల ద్వారా రైతు కూలీలు, ప్రజలు ఆనందగా ఉన్నారనీ అన్నారు. అడిగినవన్నీ లేదనకుండా సమకూరుస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఆశీర్వదించాలని ఆయన అన్నారు.
News Posted: 20 February, 2009
|