రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్ బదిలీ
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికల సంఘం విధించిన నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా 2006వ సంవత్సరం, మే 3న రెవెన్యూ డివిజన్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వి.ఎల్.సురేంద్ర కరణ్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వరంగల్ రెవెన్యూ డివిజన్ లో 20 మంది పనిచేశారని, ఆర్డీవోగా అందరికన్నా సుదీర్ఘకాలం (2 సంవత్సరాల 10 నెలలు) పని చేసిన సంతృప్తి మిగిల్చిందని కరణ్ చెప్పారు. ఐదు శాసనసభ నియోజకవర్గాల ఓటరు నమోదు అధికారిగా సమర్థవంతంగా పనిచేశాననే తృప్తి ఉందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సలహాలు, సూచనల ప్రకారం ఓటరు నమోదు, సవరణలు, తొలగింపులు లను వారి సహకారంతో బాధ్యతాయుతంగా పూర్తి చేయడం జరిగిందని కరణ్ తెలిపారు.
News Posted: 21 February, 2009
|