రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం
వరంగల్ : జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హస్మత్ పేట మండలం, బాపుపేట వద్ద లారీ - ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
News Posted: 23 February, 2009
|