వరంగల్ ఆర్డీవోగా శ్రీనివాస్
(వేముల సదానందం)
వరంగల్ : వరంగల్ రెవెన్యూ డివిజిన్ అధికారిగా బద్రి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకూ ఇక్కడి ఆర్డీవోగా పనిచేసిన సురేందర్ కరణ్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బదిలీ అయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను వరంగల్ ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందినవారు. డిగ్రీ వరకూ కరీంనగర్ జిల్లాలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఉస్మానియాలో అభ్యసించారు. 1990లో డిప్యూటీ తహసీల్దారుగా శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. 2004లో డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. సర్వశిక్ష అభియాన్ వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, బోధన్ ఆర్డీవోగా ఆయన పనిచేశారు. తరువాత వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బద్రి శ్రీనివాస్ పనిచేస్తుండగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళారు.
News Posted: 23 February, 2009
|