ఓటర్ల జాబితాపై సమీక్ష
(వేముల సదానందం)
వరంగల్ : రానున్న ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి పౌరునికీ ఓటు హక్కు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధి, శిక్షణాశాఖ కమీషనరు డి.శ్రీనివాసులు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయన ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమావేశాన్ని జిల్లా కలెక్టర్, డా.బి.జనార్థన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కరుణ, ఆర్.డి.ఓ.లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డు తొలగించిన ఓటర్ల రిజిస్టర్లను, ఓటర్ల జాబితాపై వచ్చే ఫిర్యాదులను, సామాన్య ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వేర్వేరు రిజిస్టర్లలో నిర్వహించాలని ఓటర్ల జాబితా పరిశీలనాధికారికి వివరించారు. ఓటర్ల జాబితాతో పాటు ఓటరు గుర్తింపు కార్డులో ఓటర్ల ఫోటోలు తప్పుగా ప్రచురితం కాకుండా చూడాలన్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు
News Posted: 6 March, 2009
|