ప్రచారంపై కలెక్టర్ ఆంక్షలు
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫెక్స్ బ్యానర్లు, వాల్ రైటింగ్ లను ఆయా పార్టీలు, నాయకులు స్వచ్చంధంగా తొలగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.బి.జనార్థన్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వెలువడడంతో ఎన్నికల నియమావళీ, ఓటర్ల జాబితా తదితర అంశాలపై రాజకీయ ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే అధికాశాతం బ్యానర్లు తొలగించామనీ, ఇంకా ఉన్న వాటిని వెంటనే తొలగించాలన్నారు. మిగిలిన బ్యానర్లను ఆయా పార్టీల వారు తొలగించాలనీ లేకుంటే వాటికయ్యే ఖర్చును ఆయా రాజకీయ పార్టీల వ్యయంలో కలుపుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణాల్లో ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించకూడదనీ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ షోలను జరపకూడదని ఆయన స్పష్టం చేశారు. మరణించిన వారు, వలస పోయిన వారు, చిరునామా దొరకని వారిని ఓటర్ల జాబితానుండి తొలగిస్తామన్నారు. దొంగవోట్ల నివారణకు సాధ్యమైనంత వరకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. హన్మకొండ తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
News Posted: 6 March, 2009
|