అతిథి గృహాల నవీకరణ
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో వివిధ శాఖల పరిధిలో గల ప్రభుత్వ అతిథి గృహాలను నవీకరించాలని జిల్లా కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ని తన చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అతిథి గృహాల ప్రస్తుత పరిస్థితిని సంబంధిత అధికారులను అడిగి తెలిసుకున్నారు. ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్న దృష్ట్యా రోడ్ల, భవనాల శాఖ, సాగునీటి పారుదలశాఖ, జిల్లా పరిషత్, మున్సిపాలిటి ఆధీనంలో గల అతిథి గృహాలను ఆధునీకరించి, ఉన్న సౌకర్యాలను మెరుగుపరచి, వాటిని సద్వినియోగం చేసుకొనే స్థితికి తీకురావాలని అన్నారు. కార్యాలయాల ప్రహరి గోడలు, కల్వర్టుల పైన స్లోగన్ లు రాసి ప్రచారం సాగిస్తున్నారనీ, వారిపై కేసులు నమోదు చేయించాలని దీనికి ప్రతిశాఖ తన పరిధిలో తామే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ వెంకట్రామయ్య, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 9 March, 2009
|