ఎమ్మెల్సీకి నామినేషన్లు
(వేముల సదానందం)
వరంగల్ : శాసనమండలికి స్థానిక సంస్థల నుండి జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ ఐ అభ్యర్థిగా కొండామురళీ తన నామినేషన్ ను సోమవారం ధాఖలు చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్, అధికారి, జాయింట్ కలెక్టర్ వి.కరుణకు అందచేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మాత్యులు పొన్నాల లక్ష్యయ్య, ఎమ్మెల్సీ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావులు హాజరైనారు. కొండా మురళి నామినేషన్ ను జెడ్పిటిసిలు సూరం రంగారెడ్డి, రెండోసెట్ ను బీరం సునంద, తింగళికారి సత్యనారాయణలు, మేడిశెడ్డి స్వరూపలు బలపర్చారు.
News Posted: 9 March, 2009
|