కలెక్టర్ ను కలిసిన ప్రణీత
(వేముల సదానందం)
వరంగల్ : యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యాక్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీత సోమవారంనాడు జిల్లా కలెక్టర్ బి. జనార్దన్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ప్రణీత ఆరోగ్య విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో పరీక్షలకు హాజరవుతుండడం పట్ల ప్రణీతను కలెక్టర్ అభినందించారు. ఇప్పటి వరకూ తన చికిత్సకు 11 లక్షల రూపాయలు వ్యయం అయిందని, ప్లాస్టిక్ సర్జరీకి కూడా ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్ కు ప్రణీత విజ్ఞప్తి చేసింది. తనపై యాసిడ్ దాడి జరిగిన సందర్భంగా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నందుకు ప్రణీత కృతజ్ఞతలు తెలిపింది.
News Posted: 17 March, 2009
|