బ్రెయిలీ లిపిలో ఓట్ల సౌకర్యం
(వేముల సదానందం)
వరంగల్ : రానున్న ఎన్నికల్లో అంధులకు, వికలాంగులకు స్వంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకై ప్రత్యేక ఏర్పార్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి వరంగల్లు కేంద్రం ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాటలపై జిల్లా ప్రజలతో ఆయన ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈసందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి పలువురు అడిగిన సందేహాలకు కలెక్ట్ సమాధానాలు ఇచ్చారు. అంధ ఓటర్లు ఏ విధమైన సహాయకులు లేకుండానే తామే ఓటు వేసే విధంగా ఎలక్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బ్రెయిలీ లిపి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంధులకు ఇవిఎం లపై ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి బ్రెయిలీ లిపిలో నెంబర్లు కేటాయించునున్నామని, ఈ నెంబర్లు ఏ అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వివరాలు పోలింగ్ కేంద్రం ఎదుట ఉంచనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే త్రి చక్రాల సైకిళ్ల ద్వారా వచ్చే వికాలంగుల ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా ర్యాంపుల నిర్మాణం చేపడ్తున్నామని తెలిపారు. ఏ ఓటరు పేరు తప్పుగానీ, ఫోటో తప్పుగానీ ప్రచురితమైతే ఫారం 8 ద్వారా సంరించుకోవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లాల పౌరసంబంధాల అధికారి కె.వెంకట రమణ, ఆకాశవాణి కార్యక్రమ నిర్వహాకులు పి.వి.సి.సత్యానారాయణ, జైపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
News Posted: 23 March, 2009
|