సర్వం సిద్దం
(వేముల సదానందం)
వరంగల్ : ఏప్రిల్ 16న జరగున్న సాధారణ జమిలి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.జనార్థన్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రెండు లోక్ సభ, 12 శాసనసభ స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు అసరమైన ఏర్పాటలను పూర్తి చేసినట్లు చెప్పారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 29,030 పార్టీల జెండాలు, 14,464 బ్యానర్లు, 15,710 గోడలపై వ్రాతల చెరిపివేత, 6025 హోర్డింగ్ ల తొలగింపు, 67,310 పోస్టర్ ల తీసివేత 444 ప్రకటన బోర్టులను తొలిగంచినట్లు ఆయన చెప్పారు.
500 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 210 గా, 500 నుండి 800లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 1269గా, 800 నుండి 1200 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 1308గా, 1200 నుండి 1400 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 124గా, 1400లకు మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు కేవలం 5 నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఒక పోలింగ్ కేంద్రం కలిగిన భవనాలు 765 కాగా, రెండు పోలింగ్ కేంద్రులు కలిగిన భవనాలు 601కాగా, మూడు పోలింగ్ కేంద్రాలు కలిగిన భవనాలు 182 కాగా, నాలుగు పోలింగ్ కేంద్రాలు కలిగిన భవనాలు 85, ఐదు పోలింగ్ కేంద్రాలు కలిగిన భవనాలు 11, ఎనిమిది పోలింగ్ కేంద్రాలు కలిగిన 8 భవనాల సముదాయాలుగా విభజించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వి.కరుణ, డిఆర్వో శ్రీరాంరెడ్డి, పరిపాలనా ఎస్పీ రమేష్ నాయుడు, సిఐలు దక్షిణ మూర్తి, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 23 March, 2009
|