ఆదర్శ రైతులకు కలెక్టర్ షాక్
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ఒక రాజకీయ పార్టీ చేర్యాలలో నిర్వహించిన సభకు హాజరైనందుకు గాను 22 మంది ఆదర్శరైతులను తొలగించినట్లు జిల్లా కలెక్టర్ డా.బిజనార్థన్ రెడ్డి తెలిపారు. చేర్యాల మండలంలో ఈనెల 13న ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సమావేశానికి ఆదర్శరైతులు హాజరైయ్యారంటూ పత్రికల్లో ఫోటోతో సహా మార్చి 14న వార్త ప్రచురితమైంది. ఈ వార్తను అనుసరించి మార్చి 15వ తేదీన చేర్యాల మండలంలోని 22 మంది ఆదర్శరైతులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, 16వ తేదీన ఆదర్శరైతులు తమ వివరణ ఇచ్చారు. ఆదర్శ రైతులు ఇచ్చిన వివివరణలకు సంతృప్తి చెందనిజిల్లా కలెక్టర్ వారిని పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు మండలంలో కూడా ఒక రాజకీయ పార్టీకి హాజరు అయ్యారనే ఆరోపణలో ముగ్గురు ఆదర్శ రైతులకు నోటీసులు జారీ చేశారు.
చేర్యాల మండలంలో తొలగించిన ఆదర్శరైతులు : గణపురం కళాధర్, ఆకునూరు గ్రామం, బొడిజె సంతోష్, తాండూరు గ్రామం, బుర్ర శ్రీనివాస్, దానంపల్లి గ్రామం, కొలిపాక కనకయ్య, దొమ్మాట గ్రామం, సుంకరి శ్రీధర్, ఆకునూరు గ్రామం, మేర్గు ఆదినారాయణ, గురిజెకుంట గ్రామం, నూకల నర్శింహులు, తాడూరు గ్రామం, తెట్టబోయిన డెవిడ్, పెద్దరాజుపేట గ్రామం, పన్ జాల నర్సింహులు, కిష్టంపేట గ్రామం, ఆముదాల బాలమణి, చేర్యాల గ్రామం, మల్లేశం, కొమురవెల్ళి గ్రామం, రంగు తిరుపతి, రాంపూర్ H/o కూనూరు గ్రామం, గంగనబోయిన సిద్దులు, చిట్యాల గ్రామం, మేర్గు సుధాకర్, అయినాపూర్ గ్రామం, మాక్య భీరయ్య, చిట్యాల గ్రామం, మిన్నలాపురం అంజయ్య, ముస్త్యాల గ్రామం, వడ్లకొండ ప్రకాశ్, ముస్త్యాల గ్రామం, గడవరాజు యాదగిరి, కొడవేర్గు గ్రామం, సమలాపల్లి గణేష్, ఐనాపూర్ గ్రామం, ఎరుకల సుదర్శన్ ఐనాపూర్ గ్రామం, జంగా మల్లేషం మర్రిముస్త్యాల గ్రామం, సిరిమల్ల అంజయ్య, గోరిపిల్లి గ్రామం.
News Posted: 24 March, 2009
|