మద్యం అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ కన్ను
(వేముల సదానందం)
వరంగల్ : ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన జిల్లాలోని గ్రామ కార్యదర్శులు, వి.ఆర్.ఓలు, పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాల నిరోధం, గుడుంబా సారాయి తయారీని నిరోధించడంతో పాటు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేసే కీలక బాధ్యత గ్రామ టాస్క్ ఫోర్స్ కమిటీలదేనని అన్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో టాస్క ఫోర్స్ కమిటీల ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే మొదటిసారని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణాధికారులు శ్రీధర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 25 March, 2009
|