సురేఖ నామినేషన్ దాఖలు
(వేముల సదానందం)
వరంగల్ : ఏప్రిల్ 16న పార్లమెంట్ కు, అసెంబ్లీకి జరగున్న సాధారణ ఎన్నికలకు మూడవ రోజు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మహబూబాద్ పార్లమెంట్ స్థానానికి కచ్చెల రంగారెడ్డి న్యూ డెమెక్రసి పార్టీ తరపున నామినేషన్ వేయగా, శాసనసభ నిజోయవకర్గానికి స్వతంత అభ్యర్థిగా మాంగ్యా బాణోతు నామినేషన్ వేశారు. శాసనసభకు సంబందించి స్టేషన్ ఘన్ పూర్ నుండి టిఆర్ఎస్ తరపున చింతాస్వామి, స్వతంత్ర్య అభ్యర్థిగా జీడి రమేష్ కుమార్ లు నామినేషన్లు వేశారు. పాలకుర్తి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున, స్వతంత్ర్య అభ్యర్థిగా ముత్తినేని సోమేశ్వర్ రావు, యుసిసిఆర్ఇఎంఎల్ తరపున పాము రమేష్, స్వతంత్ర అభ్యర్థిగా మేకల కేదారి నామినేషన్లు వేశారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం నుండి పిరమిడ్ పార్టీ తరపున జుమ్మిదల కిషన్ రెడ్డి, వరంగల్ తూర్పు నుండి ఎండి.ఇక్బాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భూపాలపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా, యుసిసిఆర్ఐఎంఎల్ తరపున సింగపా లింగం, పరకాల నుండి శ్రీమతి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ తరపున వేయగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు అప్పాల అభిలాష్ వేశారు.
News Posted: 26 March, 2009
|