ఉగాది వేడుకలు
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో విరోధి నామ ఉగాది ఉత్సవాలను చారిత్రాత్మక వేయి స్థంబాల దేవాలయంలో 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్, డిబిఆర్ ఓ.కె.వెంకట రమణ తెలిపారు. దేవాదాయ శాఖతో కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు నూతన సంవత్సర ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ బి.జనార్థన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఉగాది వేడుకలను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. నాదస్వరం, పంచాంగ పఠనం, కవి సమ్మేళనం తదుపరి పండితులకు, కవులకు సత్కారం కార్యక్రమాలు ఉంటాయని రమణ తెలిపారు.
News Posted: 26 March, 2009
|