4రోజున 15 నామినేషన్లు
(వేముల సదానందం)
వరంగల్ : పార్లమెంట్ కు, అసెంబ్లీకి జరగనున్న సాధారణ ఎన్నికలకు నాల్గోరోజున 15 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వరంగల్ పార్లమెంట్ స్థానాలకి పాకాల దేవదానం యుసిసిఆర్ఐఎంఎల్ తరపున పాతకోట లాలయ్య, బహుజన్ సమాజ్ పార్టీ తరపున నామినేషన్ వేశారు. నర్సంపేట నియోజకవర్గం నుండి ఎ.నర్సమ్మ న్యూడెమోక్రసీ తరపున, ఆర్.కొండల్ రావు పిరమిడ్ తరపున, ఎ.శ్రీను యుసిసిఆర్ఐఎంఎల్, వి.రాజేశ్ రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థిగా, పరకాల నియోజకవర్గం నుండి మోర్తాల చందర్ రావు యంసిపిఐ నుండి, వరంగల్ తూర్పు నియోజకవర్గం కుంట అనిత స్వతంత్ర్య అభ్యర్థిగా రెండవ సెట్ గా దాఖలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ నియోజకవర్గానికి చింతా సువార్త బహుజన సమాజ్ పార్టీ నుండి, పాలకుర్తి నియోజకవర్గం నుండి జమున, డోర్నకల్ నియోజకవర్గం నుండి భూక్యా కిష్టు నాయక్ స్వతంత్ర్య అభ్యర్థిగా, మహబూబాబాద్ నియోజకవర్గం నుండి హలావత్ లింగ్యా స్వతంత్ర్య అభ్యర్థిగా రెండవ సెట్ ను దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుండి సింగటి సాంబయ్య యంసిపిఐ నుండి వర్గన్న పేట నియోజకవర్గం నుండి సంగల ఈర్నియ స్వతంత్ర్య అభ్యర్తిగా, ములుగు నియోజకవర్గం నుండి బూర్క వెంకటయ్య న్యూ డెమోక్రసి తరపున నామినేషన్లు దాఖలు చేశారు.
News Posted: 27 March, 2009
|